: వచ్చే 48 గంటల్లో దేశవ్యాప్తంగా వర్షాలు.. రెండేళ్ల కరవు తీరుతుందన్న వాతావరణ శాఖ
రానున్న 48 గంటల్లో దేశంలో కరవు తీరా వానలు పడనున్నాయి. విస్తారమైన వర్షాలతో రెండేళ్ల వరుస కరవు తీరిపోనుంది. ఈ మేరకు వాతావరణశాఖ పేర్కొంది. రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అయితే రాజస్థాన్, గుజరాత్ లోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాల్సి ఉన్నట్టు జాతీయ వాతావరణ విభాగం చీఫ్ బీపీ యాదవ్ తెలిపారు. వర్షాలపై ఆధారపడే భారత్‌కు ముఖ్యంగా రైతులకు ఇది తీపి కబురని ఆయన పేర్కొన్నారు.