: ‘ఇండిక్యాష్ దోపిడీ’ నాటకమట!... సిబ్బందే అసలు దొంగలట!


నల్లగొండ జిల్లాలో నిన్న రాత్రి చోటుచేసుకున్న ఇండిక్యాష్ దోపిడీ ఘటన సాంతం నాటకమేనట. బ్యాంకులతో పాటు ఇండిక్యాష్ సంస్థను బురిడీ కొట్టించేందుకు యత్నించిన సిబ్బంది ఏకంగా రూ.32 లక్షలను కొల్లగొట్టేందుకు యత్నించారు. ఈ క్రమంలో వారి ఫిర్యాదుతోనే రంగంలోకి దిగిన పోలీసులు వారినే అదుపులోకి తీసుకుని షాకిచ్చారు. వివరాల్లోకెళితే... నల్లగొండ జిల్లాలోని పలు ఏటీఎం యంత్రాల్లో డబ్బు పెట్టేందుకు బయలుదేరిన ఇండిక్యాష్ వాహనాన్ని వెలమకన్నె వద్ద ఆపేసిన దుండగులు రూ.32 లక్షలను ఎత్తుకెళ్లారని ఆ వాహనం సిబ్బంది శ్రీను, నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ జరిగిన తీరు, సిబ్బంది చెప్పిన మాటలను విన్న పోలీసులు ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కాస్తంత తడబడ్డ శ్రీను, నాగరాజులను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించేసరికి అసలు విషయం చెప్పేశారు. దీంతో ఈ చోరీ అసలు మిస్టరీ వీడిపోయింది.

  • Loading...

More Telugu News