: సమ్మె వాయిదా!... నేడు, రేపు యథావిధిగా పనిచేయనున్న బ్యాంకులు!
పలు డిమాండ్ల పరిష్కారం కోసం నేడు, రేపు చేయతలపెట్టిన సమ్మెను బ్యాంకింగ్ ఉద్యోగులు వాయిదా వేసుకున్నారు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు సమ్మెను వాయిదా వేసుకుంటున్నట్లు అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటాచలం నిన్న ఓ ప్రకటనలో తెలిపారు. బ్యాంకు ఉద్యోగుల సమ్మెపై దాఖలైన పిటిషన్ ను నిన్న విచారించిన ఢిల్లీ హైకోర్టు... సమ్మెను ఉద్యోగులు వాయిదా వేసుకోవాలని సూచించింది. కోర్టు ఆదేశాలతో కాస్తంత వెనక్కు తగ్గిన ఉద్యోగులు కూడా సమ్మెను వాయిదా వేసుకునేందుకు సిద్ధపడ్డారు. ఈ క్రమంలోనే ఉద్యోగుల సంఘం నుంచి నిన్న సాయంత్రానికే ప్రకటన వెలువడింది. సమ్మె వాయిదా పడటంతో నేడు, రేపు యథావిధిగా బ్యాంకులు పనిచేయనున్నాయి.