: నల్లగొండ జిల్లాలో దారి దోపిడి!... టాటా ఇండిక్యాష్ వాహనం నుంచి రూ.32 లక్షలు చోరీ
తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో నిన్న రాత్రి భారీ చోరీ జరిగింది. ఏటీఎం యంత్రాల్లో డబ్బులు పెట్టేందుకు బయలుదేరిన టాటా ఇండిక్యాష్ వాహనంపై దాడి చేసిన గుర్తు తెలియని దుండగులు రూ.32 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో దుండగులు వాహనంలోని సిబ్బంది కళ్లల్లో కారం కొట్టి దోపిడీకి పాల్పడ్డారు. జిల్లాలోని వెలమకన్నె వద్ద చోటుచేసుకున్న ఈ ఘటనపై సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాహనాన్ని ఆపిన దుండగులు తమ కళ్లల్లో కారం చల్లి నగదుతో ఉడాయించారని వారు తెలిపారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు చోరీ జరిగిన తీరుతో పాటు సిబ్బంది చెప్పిన వివరాలను పరిశీలిస్తున్నారు. ఈ చోరీపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.