: ఆర్బీఐ గవర్నర్ గా అరవింద్ పనగారియా?
ఆర్బీఐ కాబోయే గవర్నర్ గా అరవింద్ పనగారియా నియమితులు కానున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ప్రధాని ఆర్థిక సలహాదారుగా ఉన్న అరవింద్ పనగారియాను ఆర్బీఐ గవర్నర్ గా ప్రధాని నరేంద్రమోదీ నియమించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు రానున్న 48 గంటల్లో కొత్త ఆర్బీఐ గవర్నర్ పై ప్రధాని కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కథనాలపై స్పందించేందుకు పీఎంవో గానీ, పనగారియా కార్యాలయం గానీ ఆసక్తి చూపనప్పటికీ, జూలై 18లోపు ఆర్బీఐ గవర్నర్ నియామకం జరగొచ్చునని పీఎంవో తెలిపింది.