: రేపు, ఎల్లుండి బ్యాంకులు బంద్...ఉద్యోగుల సమ్మె


దేశ వ్యాప్తంగా జాతీయ బ్యాంకుల ఉద్యోగుల సమ్మె కారణంగా రేపు, ఎల్లుండి బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ మేరకు బ్యాంకు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అనుబంధ బ్యాంకుల విలీనం, ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణను ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మెకు పిలుపు నిచ్చామని అఖిల భారత బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరి సిహెచ్ వెంకటాచలం చెప్పారు. స్టేట్ బ్యాంక్ ఉద్యోగులతో కలిసి సమ్మె చేయనున్నామని అన్నారు.

  • Loading...

More Telugu News