: సచిన్ కు నేనేమాత్రం సరితూగను...పోలికలు ఆపండి: కోహ్లీ సూచన


టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ తో తనను పోల్చడం ఆపాలని టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమానులను, మీడియాను కోరాడు. సెయింట్ కీట్స్ లో కోహ్లీ మాట్లాడుతూ, సచిన్ తో తనను ఎందుకు పోలుస్తున్నారో అర్థం కావడం లేదని అన్నాడు. అసలు సచిన్ తో తనకు పోలికేంటని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. టీమిండియాకు సచిన్ ఆడినన్ని రోజులు అందరికీ అతనొక ఆదర్శమని గుర్తు చేశాడు. తానింకా ఆ స్థాయికి చేరానని భావించడం లేదని కోహ్లీ తెలిపాడు. తనలాంటి చాలా మందికి సచిన్ ప్రేరణగా నిలిచాడని గుర్తు చేశాడు. ఇకపోతే, మానవతా కోణంలో కూడా సచిన్ కు తాను ఏమాత్రం సరిపోలనని కోహ్లీ స్పష్టం చేశాడు.

  • Loading...

More Telugu News