: అడవి జంతువుల్లా ప్రవర్తిస్తున్నాం... సిగ్గుపడాలి: సినీ నటుడు శివాజీ


హైదరాబాదులాంటి గ్లోబల్ సిటీలో అడవి జంతువుల్లా ప్రవర్తిస్తున్నామని సినీ నటుడు శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాదులో చిన్నారి రమ్య మృతికి సంతాపంగా జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, అవసరం ఉన్నా లేకున్నా గమ్యాన్ని తొందరగా చేరుకోవాలన్న ఆలోచనతో అడవిలో జంతువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. అడవిలో జంతువులకు ఎలాంటి నిబంధనలు ఉండవని, వేట అన్నదే లక్ష్యంగా ప్రయాణిస్తాయని, మనిషికి అలాంటి అవసరం లేకున్నప్పటికీ వాహనంతో రోడ్డెక్కగానే రూల్స్ తో సంబంధం లేకుండా ప్రయాణం చేస్తాడని, దీనికి ఎవరూ అతీతం కాదని అన్నారు. ఇలాంటి సందర్భాల్లోనే దుర్ఘటనలు చోటుచేసుకుంటాయని ఆయన చెప్పారు. ఇలాంటి ఘటనల వల్ల బాధితులు తీవ్రంగా నష్టపోతారని, దానికి కారణం ఎవరని? ఏంటని? ఆలోచించాలని ఆయన సూచించారు. తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరిస్తే ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News