: హోంగార్డులను భయభ్రాంతులకు గురి చేయడం సరికాదు: ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్
రంగారెడ్డి జిల్లా ఎస్పీ ఇంట్లో హోం గార్డులు వెట్టిచాకిరి చేస్తున్న దృశ్యాలు బయటపడిన అంశంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ.. మీడియా సంస్థలు ఎక్కడ అన్యాయం జరిగినా ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయని అభినందించారు. వెట్టి చాకిరిపై ఫిర్యాదు చేస్తే హోంగార్డులను సస్పెండ్ చేయడం, వారిని భయభ్రాంతులకు గురి చేయడం సరికాదని ఆయన అన్నారు. కక్ష సాధించేలా వారిపై అధికారులు ప్రవర్తించడం భావ్యం కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.