: పోర్చుగల్ విజయం... ఆనందంలో క్రికెటర్ యువరాజ్ సింగ్
యూరో కప్ - 2016 ఫైనల్ మ్యాచ్ లో ఫ్రాన్స్ ను మట్టికరిపించిన పోర్చుగల్ టీం మైదానంలో విజయగర్వంతో సంబరాలు చేసుకున్న విషయం తెలిసిందే. అదే సమయంలో, ఆ మ్యాచ్ ను టీవీలో వీక్షించిన టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా తన సంతోషాన్ని ఆపుకోలేకపోయాడు. ‘జంప్.. జంప్’ అంటూ పోర్చుగల్ కి మద్దతు తెలిపాడు. ఈ మేరకు యువరాజ్ ఒక ట్వీట్ చేసి నెటిజన్లతో తన ఆనందాన్ని పంచుకున్నాడు. పోర్చుగల్ ప్లేయర్ రొనాల్డోకు యువరాజ్ అభిమాని కావడం, పోర్చుగల్ తొలిసారిగా విజేతగా నిలవడంతో యువీ ఆనందానికి అంతులేకుండా పోయింది.