: ఎస్పీ ఇంట్లో హోంగార్డుల వెట్టిచాకిరిపై విచార‌ణ ప్రారంభం


ఇటీవ‌ల రంగారెడ్డి జిల్లా ఎస్పీ ఇంట్లో హోం గార్డులు వెట్టిచాకిరి చేస్తున్న దృశ్యాలు బ‌య‌టప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ అంశంపై డీఐజీ అకున్‌ సబర్వాల్‌ విచారణ ప్రారంభించారు. స‌బర్వాల్ స‌ద‌రు హోంగార్డుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. మ‌రో వైపు ఎస్పీ నుంచి కూడా వాంగూల్మం న‌మోదు చేసుకున్నారు. ఈ అంశంపై స‌మ‌గ్రంగా వివ‌రాలు సేక‌రించి కొన్ని రోజుల్లో ఇన్‌ఛార్జి డీజీపీకి ఈ నివేదిక‌ను అందించ‌నున్నారు. మ‌రోవైపు త‌మ‌తో వెట్టిచాకిరి చేయించుకున్న అంశంపై ఎస్పీపై ఫిర్యాదు చేసేందుకు హోంగార్డులు డీఐజీ ఆఫీస్ వ‌ద్ద నిరీక్షిస్తున్నారు. సుమారు 20 మంది హోంగార్డులు కార్యాల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న‌ట్లు స‌మాచారం.

  • Loading...

More Telugu News