: రణ్ వీర్ నా మనసులో ఉన్నాడు.. అతడే నా భర్త: రచయిత్రి నికితా సింగ్
‘రణ్ వీర్ నా మనసులో ఉన్నాడు. అతడే నా భర్త’ అంటూ ప్రముఖ రచయిత్రి నికితా సింగ్ చెప్పింది. ‘ది టెలిగ్రాఫ్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నికిత మాట్లాడుతూ, భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యాపై తనకు తొలిప్రేమ ఉండేదని చెప్పింది. అతనికి పెళ్లయింది కదా? అన్న ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ, ఫర్వాలేదని, 'ఇప్పుడు రణ్ వీర్ సింగ్ నా భర్త' అని అనడంతో ఆశ్చర్యపోయిన సదరు విలేకరి, రణ్ వీర్ అంటే బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ గురించేనా? అని తిరిగి ప్రశ్నించగా, ‘అవును’ అని ఆమె సమాధానమిచ్చింది. రణ్ వీర్, తన స్నేహితుడికి బాగా తెలుసని, రణ్ వీర్, దీపికా పదుకొనేల ప్రేమ గురించి అతను తనతో ప్రస్తావించగా.. రణ్ వీర్ తన మనస్సులో ఉన్నాడని, అతడే తన భర్త అని, ఆ సంతోషం నుంచి తనను దూరం చేయాలనుకోవద్దని తన మిత్రుడికి చెప్పానని నికితా సింగ్ ఆ ఇంటర్వ్యూలో చెప్పింది. కాగా, ఈ వ్యాఖ్యలపై దీపికా పదుకొనే ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.