: విహార యాత్ర రద్దు చేశారని వీరంగమేసిన విద్యార్థులు
బీహార్ లోని నలందలోని ఓ ప్రైవేటు స్కూలు విద్యార్థులు ఆగ్రహానికి గురయ్యారు. విహారయాత్ర నిర్వహిస్తామని చెప్పిన స్కూలు యాజమాన్యం అందుకు రుసుము వసూలు చేసింది. ఆ ఫీజు చెల్లించిన విద్యార్థులు విహారయాత్ర కోసం ఆసక్తిగా ఎదురు చూడడం ప్రారంభించారు. ఇంతలో విహారయాత్రను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ఆగ్రహానికి గురైన విద్యార్థులు స్కూలులోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా స్కూలులో టీచర్లు లేరని, తమకు పాఠాలు చెప్పడం లేదని అందుకే ఫర్నిచర్ ధ్వంసం చేశామని విద్యార్థులు చెప్పడం విశేషం.