: ప్రతి నాలుగు సెకన్లకు 5 రెడ్ మి ఫోన్లు అమ్ముడుపోతున్నాయట
ప్రతి నాలుగు సెకన్లకు 5 రెడ్ మి ఫోన్లు మార్కెట్ లో అమ్ముడుపోతున్నాయని కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ల కంపెనీ జియోమి ప్రవేశపెట్టిన రెడ్ మి ఫోన్ల అమ్మకాలు కేవలం చైనా మార్కెట్ లో మాత్రమే కాక, భారత్ మార్కెట్లో కూడా దూసుకుపోతున్నాయి. ఈ విషయాన్ని జియోమీ గ్లోబల్ ఆపరేషన్ల వైస్ ప్రెసిడెంట్ హ్యుగో బార తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 2013 ఆగస్టులో రెడ్ మీ ఫోన్ ను ఆవిష్కరించారు. అప్పటి నుంచి మొత్తం 11 కోట్లు రెడ్ మీ ఫోన్లు అమ్ముడుపోయాయని, మూడేళ్లలో ఒక సెకనుకు 1.21 యూనిట్లు అమ్మినట్లు తెలిపారు. ఫ్లాష్ సేల్స్ ద్వారా తమ కంపెనీ ఫోన్లు ఎక్కువగా విక్రయించినట్లు హ్యుగో బార పేర్కొన్నారు.