: సింథియా కుమార్తె సానియాకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించండి: కోర్టు ఆదేశాలు
భర్త రూపేశ్ చేతిలో దారుణంగా హత్యకు గురయిన సింథియా కుమార్తె సానియా అప్పగింతపై ఈరోజు రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ కోర్టులో పిటిషన్ దాఖలయింది. చిన్నారిని తమకే అప్పగించాలని రూపేశ్ తల్లి లలితాదేవి పిటిషన్ వేశారు. సానియా ఎవరి సంరక్షణలో పెరగాలనే అంశం తేలేవరకు ఆమెను చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించాలని సీసీఎస్ పోలీసులకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే చిన్నారి సానియాకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. సింథియాను హత్యచేసిన తరువాత నిందితుడు రూపేశ్ ఆమె మృతదేహాన్ని కాల్చేసిన సంగతి తెలిసిందే. కాలిపోయిన మృతదేహం సింథియాదేనని నిర్ధారణ చేయడం కోసం సానియాకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు నిందితుడి కస్టడీకి సంబంధించి కోర్టు రేపు ఉత్తర్వులు వెల్లడించనుంది. కాంగో రాయబారి బ్రిగెట్టి కూడా ఈరోజు కోర్టులో హాజరయ్యారు.