: ఆ షూటింగ్ లో చిరంజీవి, రాధిక ఒకరినొకరు చెంపదెబ్బ కొట్టుకున్నారు: దర్శకుడు కోదండరామిరెడ్డి
నాటి చిత్రం ‘న్యాయం కావాలి’ షూటింగ్ లో చిరంజీవి, రాధిక ఒకరినొకరు చెంపదెబ్బ కొట్టుకున్నారని ఆ చిత్ర దర్శకుడు కోదండరామిరెడ్డి అన్నారు. ఆయన తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో గత విషయాలను గుర్తు చేసుకున్నారు. ‘‘న్యాయం కావాలి’ లో ఒక సన్నివేశంలో చిరంజీవిని రాధిక చెంపదెబ్బ కొట్టే సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా... రాధిక నిజంగానే చిరంజీవిని కొట్టింది. మరో సన్నివేశంలో రాధికను చిరంజీవి చెంపదెబ్బ కొట్టాలి. ఆ సీన్ లో చిరంజీవి కూడా నిజంగానే రాధిక చెంపపై కొట్టారు. దీంతో వారి మధ్య ఘర్షణ జరిగింది. ఆ తర్వాత, వీరిద్దరి కాంబినేషన్ లోనే నా తదుపరి చిత్రం ‘అభిలాష’ కూడా తీశాను. ఈ చిత్రం షూటింగులో వీళ్లిద్దరూ ఎడమొహం, పెడమొహంగా ఉండేవారు. దీంతో, వాళ్లిద్దరికీ నచ్చజెప్పడంతో సమస్య సద్దుమణిగింది’ అని కోదండరామిరెడ్డి నాటి విషయాలను ప్రస్తావించారు.