: వైసీపీ నేతలకు పచ్చ కామెర్లు వచ్చాయి: చినరాజప్ప విమర్శలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన గడపగడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రమంపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలకు పచ్చ కామెర్లు వచ్చాయని అన్నారు. కష్టాల్లో ఉన్న ఏపీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ పక్క అభివృద్ధి దిశగా నడిపిస్తోంటే, మరోవైపు వైసీపీ రాష్ట్రంలో అభివృద్ధే లేదంటూ ఈ కార్యక్రమం చేపట్టడమేంటని ఆయన ప్రశ్నించారు. తాము చేస్తోన్న అభివృద్ధి వైసీపీకి కనిపించడం లేదని ఆయన అన్నారు. గడపగడపకు వైఎస్సార్ సీపీ అంటూ కార్యక్రమం చేపడుతోన్న జగన్‌పై ఎన్ని కేసులు ఉన్నాయో వైసీపీ నేతలు తెలుసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.