: మొక్కలు నాటిన చిరంజీవి, నాగార్జున
అడవుల శాతం పెంచి, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుకోవాలనే లక్ష్యంతో తెలంగాణలో చేపట్టిన హరితహారం కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈరోజు 25 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలతో పాటు రాజకీయ, సినీ రంగ ప్రముఖులు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈరోజు జూబ్లీ హిల్స్‌లో సినీ నటుడు అల్లు అర్జున్, నానక్ రామ్ గూడలో దగ్గుబాటి రానా మొక్కలు నాటి ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రోత్సహించిన సంగతి తెలిసిందే. సినీనటుడు, కాంగ్రెస్ నేత చిరంజీవి కూడా జూబ్లీహిల్స్‌లో హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటారు. మరోవైపు అన్నపూర్ణ స్టూడియోలో టాలీవుడ్ నటుడు నాగార్జున మొక్కలు నాటి ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. నాగార్జున భార్య అమల కూకట్‌పల్లిలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.