: గణేశ్ విగ్రహాల ఎత్తు 15 అడుగులకి మించి ఉండకూడదు: మరోసారి సూచించిన హైకోర్టు
హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున నిర్వహించే గణేశ్ ఉత్సవాలపై హైకోర్టు ఈరోజు మరోసారి స్పందించింది. హుస్సేన్ సాగర్‌లో గణేశ్ నిమజ్జనం చేయరాదన్న వ్యాజ్యంపై ఈరోజు విచారణ చేపట్టిన హైకోర్టు ఉత్సవాల ఏర్పాట్లపై ఎలాంటి చర్యలు చేపట్టారో తమకు తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాలుష్యం, విగ్రహాల తయారీకి వాడే రంగు లాంటి పలు అంశాలపై గతంలో తాము జారీ చేసిన ఆదేశాలను హైకోర్టు మరోసారి గుర్తు చేసింది. విగ్రహాల ఎత్తు 15 అడుగులకు మించరాదని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీకి సూచించింది.