: పాలమూరు ప్రాజెక్టు డిజైన్ మార్చాలి: ప‌్రొ.కోదండరాం డిమాండ్
తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీజేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరాం మరోసారి గళం విప్పారు. ఈరోజు ఉదయం మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం రూపొందించిన పాలమూరు ప్రాజెక్టు డిజైన్ ను మార్చాలని డిమాండ్ చేశారు. రైతులకు అన్యాయం చేయొద్దని ఆయన అన్నారు. ఈనెల 21 నుంచి ముంపు ప్రాంతాలను సందర్శిస్తామని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని ఆయన తెలిపారు. నార్లపూర్ నుంచి ఉదంపూర్ వరకు ఎంతో మంది రైతులు నిర్వాసితులుగా మారుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.