: ఉగ్రవాదుల్లో చేరాలని కేరళ నుంచి మాయమైన 21 మందిలో ఒకరు ముంబైలో పట్టివేత


సిరియాకు వెళ్లి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల్లో చేరాలన్న ఆలోచనతో కేరళ నుంచి మాయమైన 21 మందిలో ఒకరిని ముంబైలో అరెస్ట్ చేశారు. సిరియాకు బయలుదేరిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి విచారిస్తున్నామని పోలీసు వర్గాలు తెలిపాయి. ఇతని అరెస్టుతో మిగతావారు ఎక్కడున్నారన్న సమాచారం లభిస్తుందని భావిస్తున్నట్టు వెల్లడించారు. వీరంతా ఇప్పటికే ఇండియాను వదిలి వెళ్లారా? అన్న విషయమై సమాచారం లేదని, అన్ని ఎయిర్ పోర్టుల్లోని ప్రయాణికుల జాబితాలను పరిశీలిస్తున్నామని వివరించారు. కాగా, గత శనివారం వరకూ కేరళ నుంచి మాయమైన వారి సంఖ్య 16గా ఉండగా, ఇప్పుడది 21కి పెరిగింది. వీరిలో కనీసం ఇద్దరు సిరియాకు వెళ్లిపోయి ఉగ్రవాదుల్లో కలిసినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. వీరంతా ఓ ఏడాది క్రితం ఇస్లాం మతం స్వీకరించిన క్రిస్టియన్, హిందూ కుటుంబాలకు చెందిన వారన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News