: మృతదేహాలు చూసేదాకా, బుర్హాన్ ను హతమార్చామన్న సంగతే తెలీదు: ఇంటెలిజెన్స్ వర్గాలు
నాలుగు రోజుల క్రితం కాశ్మీరు ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఉగ్రవాది బుర్హాన్ వానీని హత్య చేయడం తమకు బోనస్ అని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. "కోకర్ నాగ్ ప్రాంతంలో కొంతమంది హిజ్బుల్ ఉగ్రవాదులు దాగున్నారన్న సమాచారం మాత్రమే మాకుంది. ఉగ్రవాది సత్రాజ్ అహ్మద్ షేక్ వారిలో ఉన్నాడని తెలిసింది. అయితే బుర్హాన్ అక్కడున్నాడని మాత్రం తెలీదు. ఎన్ కౌంటర్ ముగిసిన తరువాత, మృతదేహాలను చూసిన తరువాతే బుర్హాన్ ను గుర్తు పట్టాం" అని జమ్మూ కాశ్మీర్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పిన్న వయసులోనే ఆయుధాలు దొంగతనం చేసిన కేసులో ఇరుక్కున్న బుర్హాన్, ఆపై హిజ్బుల్ ఉగ్రవాదిగా ఎదిగి, కాశ్మీరీ యువకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుని, సామాజిక మాధ్యమాల ద్వారా వారికి ఎరవేస్తున్న సంగతి తెలిసిందే.