: భార్య, కుమారుడితో కలిసి మొక్కను నాటిన అల్లు అర్జున్.. మంచి కార్యక్రమమన్న అల్లు అరవింద్
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తన ఇంటి వద్ద హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కను నాటారు. తన భార్య నేహా రెడ్డి, కుమారుడు అయాన్ తో కలిసి ఆయన మొక్కలను నాటి నీరు పోశారు. కార్యక్రమంలో అల్లు అరవింద్ కూడా ఉత్సాహంగా పాల్గొని మొక్కను నాటారు. ఈ సందర్భంగా బన్నీ పేరుతో అక్కడ హరితహారం పోస్టర్లు కనిపించాయి. మొక్కను నాటిన అనంతరం అల్లు అరవింద్ మాట్లాడుతూ.. సిటీని పచ్చగా తయారు చేయడం మనకీ, మన తరువాతి తరాలకి మంచిదని అన్నారు. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళుతోన్న ప్రభుత్వాన్ని ఆయన ప్రశంసించారు.