: ఈరోజు కోర్టులో హాజరు కాకపోతే సంగీతను అరెస్ట్ చేస్తాం: పోలీసులు
ఎయిర్‌హోస్టస్, మోడల్ జీవితం నుంచి ఎర్రచందనం స్మగ్లర్‌గా మారిన సంగీత ఛటర్జీ బెయిల్ గడువు నేటితో ముగిసింది. స్మగ్లర్ లక్ష్మణ్‌ను వివాహం చేసుకున్న తరువాత ఆమె ఎర్రచందనం స్మగ్లర్ల లావాదేవీలు నడిపిన విషయం తెలిసిందే. ఆమెను నెల క్రితం పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆమెకు బెయిల్ లభించింది. నేడు ఆమె కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా కోర్టు పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈరోజు కోర్టులో సంగీత హాజరు కాకపోతే ఆమెను అరెస్ట్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు.