: అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య తగ్గిందన్న గణాంకాల నేపథ్యంలో... సెన్సెక్స్ బుల్ హైయస్ట్ జంప్!


అంతర్జాతీయ మార్కెట్ల లాభాలకు తోడు, అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య తగ్గినట్టు విడుదలైన గణాంకాలు, ఇన్వెస్టర్ల సెంటిమెంటును పెంచడంతో సెన్సెక్స్ బుల్ హయస్ట్ జంప్ చేసింది. ఈ సంవత్సరంలోనే అత్యధిక ప్రారంభ లాభాలను నమోదు చేసింది. సెషన్ ఆరంభంలోనే 400 పాయింట్లకు పైగా సెన్సెక్స్ లాభపడగా, నిఫ్టీ సూచిక 11 నెలల తరువాత 8,400 పాయింట్ల స్థాయిని తాకింది. ఎఫ్ఐఐలు నూతన ఈక్విటీల కొనుగోలుకు వెల్లువెత్తారని తెలుస్తోంది. ఉదయం 10:10 గంటల సమయంలో సెన్సెక్స్ 475 పాయింట్లు లాభపడి 27,601 పాయింట్లకు, నిఫ్టీ 136 పాయింట్లు పెరిగి 8,460 పాయింట్ల వద్దా కొనసాగుతున్నాయి. నిఫ్టీ-50లోని అన్ని కంపెనీలూ లాభాల్లో నడుస్తున్నాయి. ప్రధానంగా బ్యాంకుల ఈక్విటీలు దూసుకెళ్తున్నాయి. ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ తదితర బ్యాంకుల ఈక్విటీ 2 నుంచి 4 శాతం పెరిగింది.

  • Loading...

More Telugu News