: కరుణానిధి ముని మనవడి భార్యగా విక్రమ్ కూతురు!... ఘనంగా జరిగిన నిశ్చితార్థం


తమిళ సినీ స్టార్ హీరో విక్రమ్ కూతురు అక్షిత... డీఎంకే చీఫ్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఇంటి కోడలిగా వెళ్లనుంది. ఈ మేరకు ఇరు కుటుంబాల పెద్దలు కుదిర్చిన ముహూర్తం మేరకు నిన్న చెన్నైలో అక్షిత, కరుణానిధి ముని మనవడు రంజిత్ ల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. వచ్చే ఏడాది వీరిద్దరి పెళ్లిని ఘనంగా నిర్వహించేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. నిన్నటి నిశ్చితార్థానికి విక్రమ్ తరఫు బంధువులతో పాటు కరుణానిధి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

  • Loading...

More Telugu News