: గుర్‌గావ్‌లోని 41 స్కూళ్లలో వన్‌ మ్యాన్ షో.. ఒక్క టీచర్‌తోనే నెట్టుకొస్తున్న వైనం


ప్రాంతంతో సంబంధం లేకుండా ఎక్కడ చూసినా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దయనీయంగానే కనిపిస్తోంది. విద్యార్థులుంటే టీచర్లు ఉండని పాఠశాలలు, ఉపాధ్యాయులుంటే కనిపించని విద్యార్థులు ఉన్న ప్రభుత్వ స్కూళ్లు చాలానే ఉన్నాయి. అయితే హర్యానాలోని గుర్‌గావ్‌లో మాత్రం ఏకంగా 41 పాఠశాలలు ఒకే ఒక్క ఉపాధ్యాయుడితో నడుస్తున్నాయంటే ఆశ్చర్యం కలగకమానదు. వీటిలో చాలావరకు ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలు ఉన్నాయి. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్(యూడీఐఎస్ఈ) సర్వేలో ఈ విషయం వెలుగుచూసింది. సుశాంత్ లోక్ లోని ప్రాథమిక పాఠశాలలో 89 మంది విద్యార్థులకు ఒక్కరే టీచర్ ఉన్నట్టు సర్వే ద్వారా తెలిసింది. జిల్లాలోని చాలా స్కూళ్లలో ఇదే పరిస్థితి ఉంది. నిజానికి నిబంధనల ప్రకారం 30-35 మంది విద్యార్థులకు ఓ టీచర్ ఉండాలి. తమ పని జాబితాను తయారుచేసి ఎడ్యుకేషన్ డైరెక్టర్‌కు పంపించడం మాత్రమేనని, మిగతా విషయాలను అదే చూసుకోవాలని సర్వశిక్ష అభియాన్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ముకేష్ కుమార్ చెప్పడం గమనార్హం. కాగా ఇటువంటి స్కూళ్లలో చదువుకుంటున్న విద్యార్థుల భవిష్యత్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చని విద్యావేత్తలు ప్రభుత్వంపై మండిపడుతున్నారు.

  • Loading...

More Telugu News