: ‘అనంత’లో వేటకొడవళ్ల స్వైరవిహారం!... ప్రత్యర్థుల దాడిలో వ్యక్తి దారుణ హత్య!
ఫ్యాక్షన్ హత్యలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన అనంతపురం జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. ప్రత్యర్థులు జరిపిన దాడిలో చంద్రశేఖరరెడ్డి అనే వ్యక్తి నడిరోడ్డుపైనే ప్రాణాలు వదిలాడు. జిల్లాలో కలకలం రేపిన ఈ ఘటన నిన్న రాత్రి ఆ జిల్లాలోని బత్తలపల్లి మండలం మాల్యవంతంలో చోటుచేసుకుంది. ఒంటరిగా వెళుతున్న చంద్రశేఖరరెడ్డిపై ఆయన ప్రత్యర్థులు విరుచుకుపడ్డారు. వేటకొడవళ్లతో ఆయనను ఇష్టారాజ్యంగా నరికేశారు. ఈ దాడిలో చంద్రశేఖరరెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.