: నేను అజాత శత్రువును!... సోనియా గాంధీ కూడా ప్రత్యర్థి మాత్రమే!: వెంకయ్యనాయుడు


బీజేపీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు నిన్న ఓ ఆసక్తికర ప్రకటన చేశారు. దేశంలో తనకు అసలు శత్రువులే లేరని, తాను ఓ అజాత శత్రువుని అని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూడా తనకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని, తనకు ఆమె శత్రువు కాదని కూడా వెంకయ్య పేర్కొన్నారు. బీజేపీ నుంచి వరుసగా నాలుగోసారి రాజ్యసభకు ఎన్నికైన వెంకయ్యను బెంగళూరులోని తెలుగు సంఘాలు నిన్న ఘనంగా సత్కరించాయి. ఈ సందర్భంగా మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వరుసగా మూడుసార్లు తనను రాజ్యసభకు పంపిన కర్ణాటక నేతలకు, ప్రజలకు తాను రుణపడి ఉన్నానని ఆయన ప్రకటించారు. జీవితకాలం కర్ణాటక అభివృద్ధికి తాను పాటుపడతానని కూడా వెంకయ్య హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News