: నటన అనేది చెబితే రాదు... పరిశీలించి నేర్చుకోవాలి!: ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు


నటన అనేది చెబితే రాదని సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు అన్నారు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోట మాట్లాడుతూ, ‘నా లాగా యాక్షన్ చేయడం ఎలా? అంటూ చాలా మంది చిన్న నటులు నన్ను అడుగుతుంటారు. దానికి నేను చెప్పే సమాధానమేమిటంటే... చెబితే నటన రాదు... పరిశీలించి నేర్చుకోవాలని వారికి చెబుతుంటాను’ అని చెప్పారు. ఈ చిత్రాల్లో ఎందుకు నటించానని అనుకుని బాధపడిన సినిమాలు కూడా తన కెరీర్లో కొన్ని ఉన్నాయని, మంచి పక్కనే చెడు కూడా ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. కోట శ్రీనివాసరావు మంచి నటుడని, కాకపోతే ముక్కుసూటిగా వ్యవహరిస్తారని ఇండస్ట్రీలో అంటుంటారని ఆయన చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News