: అతన్ని కొట్టలేదు కానీ, కొడదామన్నంత కోపమొచ్చింది: ‘అల్లరి’ నరేష్


కొంతమంది అభిమానులు రాంగ్ ప్లేస్ లో, రాంగ్ టైమ్ లో సెల్ఫీ దిగుదామని అడుగుతుంటారని .. అది కరెక్టు కాదని హీరో ‘అల్లరి’ నరేష్ అన్నాడు. "ఎప్పుడన్నా జీవీకేలో ఒక సినిమాకు వెళతాం... ఇంటర్ వెల్ లో టాయిలెట్ కు వెళుతుంటే అభిమానులు సెల్ఫీ అంటారు. లేకపోతే, టాయిలెట్ లో సెల్ఫీ దిగుదామంటారు. ఇవన్నీ చాలా అసహ్యంగా ఉంటాయి. సెల్ఫీ గురించే ఒకసారి నాకు చాలా కోపమొచ్చింది. కొట్టలేదు కానీ, దరిదాపు కొట్టేంత కోపమొచ్చిన సంఘటన గురించి చెబుతాను. ఒక యాక్టర్ చనిపోయారు. వాళ్ల ఇంటికి వెళ్లాను. అక్కడ ఆయన డెడ్ బాడీ ఉంది.. అందరూ ఎమోషనల్ గా ఉన్నారు. ఈలోగా, ఒకాయన వచ్చి నా భుజం తట్టి, సార్.. ఒక సెల్ఫీ అన్నాడు. నాకేమో కోపమొస్తోంది... ఇప్పుడొద్దులే అని చెప్పాను. ‘ప్లీజ్ సార్.. ఒక్క సెల్ఫీ’ అని అతను అన్నాడు. మళ్లీ వద్దని చెప్పాను. అయినా, సెల్ఫీ అంటూ విసిగించాడు. సరే, అని అతని పక్కనే నిలబడ్డాను. ‘సార్, నవ్వండి సార్’ అని అతను అనడంతో నాకు కొట్టేదామన్నంత కోపమొచ్చింది.. కానీ, కొట్టలేదు. మా నాన్న చనిపోయినప్పుడు కూడా చాలా మంది వచ్చి ఇదేవిధంగా చేశారు. అక్కడికి వచ్చిన సెలబ్రిటీలను వీడియో తీయడం చేశారు" అంటూ ‘అల్లరి’ నరేష్ చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News