: మరో నాలుగు రోజుల్లో ‘కృష్ణా’కు గోదావరి నీరు: మంత్రి దేవినేని
మరో నాలుగు రోజుల్లో కృష్ణాకు గోదావరి నీరు చేరుతుందని ఏపీ నీటి పారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా జానంపేట అక్విడెక్ట్ వద్ద పోలవరం కుడికాల్వ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా దేవినేని మీడియాతో మాట్లాడుతూ, విజయనగరం జిల్లా తోటపల్లి బ్యారేజి నుంచి జులై 14న సాగునీరు విడుదల చేయనున్నట్లు చెప్పారు.