: ‘వింబుల్డన్’లో గెలిచిన ఆనందాన్ని పంచుకోలేకపోయాను: సెరెనా విలియమ్స్
నిన్న జరిగిన వింబుల్డన్ సింగిల్స్ ఫైనల్లో టైటిల్ గెలిచిన ఆనందాన్ని పంచుకోలేకపోయానని ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ చెప్పింది. మ్యాచ్ లో గెలిచిన అనంతరం సెరెనా మాట్లాడుతూ, అమెరికాలోని డాలస్ లో కాల్పుల ఘటనపై ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో డాలస్ లో ఉన్న తన కుటుంబ సభ్యుల భద్రతపై ఆందోళన చెందుతున్నానని, ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరికి సరైన విద్యను అందించాల్సిన అవసరం ఉందని సెరెనా అభిప్రాయపడ్డారు. నల్లజాతీయుల నిరసన ర్యాలీలో కొందరు జరిపిన కాల్పుల్లో ఐదుగురు పోలీసు సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.