: నవ్వుతూ పలకరించుకున్న ఉత్తమ్, కోమటిరెడ్డి!
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి నవ్వుతూ పరస్పరం పలకరించుకున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు నవ్వుతూ మాట్లాడుకున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, కోమటిరెడ్డి బ్రదర్స్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఫిరాయింపుదారులను చూసి ఊసరవెల్లిలే సిగ్గుపడుతున్నాయని, కేసీఆర్ అధికారంలోకి రాగానే నాగార్జున సాగర్ ఎండిపోయిందని, రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, దళితులకు మూడు ఎకరాల భూమి, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.