: ఎమ్మెల్యే బాబూమోహన్ కు మతి భ్రమించింది: సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు బాల్ రాజ్


మెదక్ జిల్లా ఆందోల్ ఎమ్మెల్యే, సినీ నటుడు బాబూమోహన్ పై అల్లాదుర్గం మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు బాల్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లాదుర్గం మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కలపాలంటూ నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు ఈరోజుతో తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. ఈరోజు రిలే నిరాహార దీక్షలో బాల్ రాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాము చేపట్టిన దీక్షలపై విమర్శలు చేయడం సబబు కాదని, పనీపాటాలేని వారే ఈ దీక్షలు చేస్తున్నారని మాట్లాడుతున్న బాబూ మోహన్ కు మతి భ్రమించిందని ఆరోపించారు. నాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఆందోళనలు చేసినప్పుడు కనీసం ఒక్కరోజైనా బాబూ మోహన్ పాల్గొన్నారా? అని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రా పార్టీ అయిన టీడీపీలో నుంచి ఇప్పుడు టీఆర్ఎస్ లోకి వచ్చిన బాబూ మోహన్ ప్రజలను కించపరిచే విధంగా మాట్లాడటం మానుకోవాలని ఆయన హితవు పలికారు.

  • Loading...

More Telugu News