: గడ్డం రాయుళ్లు ఈ క్లబ్ లో చేరొచ్చు!


గడ్డం రాయుళ్ల కోసం బెంగళూరు నగరంలో ఏకంగా ఓ క్లబ్బు వెలసింది. ఇప్పటికే గడ్డం వున్న వాళ్లు, తమలాంటి ఇతర గడ్డం రాయుళ్లతో స్నేహం చేసుకుని, తమ భావాలను పంచుకునేందుకు ఒక వేదిక వుండాలని భావించిన విశాల్ అనే యువకుడు ‘బెంగళూరు బియర్డ్ క్లబ్’ను స్థాపించాడు. బెంగళూరుకు చెందిన విశాల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, గడ్డం పెంచుకోవడం ఇష్టమున్న వారు, గడ్డం పెంచిన వాళ్లు ఎవరైనా సరే, ఎటువంటి కులమతాల భేదం లేకుండా ఈ క్లబ్ లో చేరవచ్చని చెప్పాడు. ఈ క్లబ్ లో ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను, వారి అభిప్రాయాలను, ఆలోచనలను ఇతరులతో పంచుకోవచ్చని అన్నారు. గడ్డం ఉన్నవారు పనికిరాని వారనో, నిర్లక్ష్యపు వైఖరి కలవారనో, జీవితంలో ఏదో కోల్పోయిన వారనో అభిప్రాయం సరికాదని సమాజానికి తెలియజెప్పడం కోసమే ఈ ఆఫ్ లైన్ సోషల్ సర్కిల్ ‘బెంగళూర్ బియర్డ్ క్లబ్’ను ఏర్పాటు చేశామని విశాల్ పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News