: బిల్లుల పేరుతో కాంగ్రెస్ నాటకాలాడుతోంది!: గాలి ముద్దుకృష్ణమ నాయుడు


అన్యాయంగా, అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు బిల్లుల పేరుతో నాటకాలు ఆడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యీ గాలి ముద్దు కృష్ణమనాయుడు విమర్శించారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రైవేట్ బిల్లుకు మద్దతు పలకాలని కాంగ్రెస్ పార్టీ కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సోనియా, రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే కనుక ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ జిల్లాలో బాక్సైట్ గనులను ధారాదత్తం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని, ఇప్పుడు రాహుల్ గాంధీ ఆ ప్రాంతంలో పర్యటించడం ప్రజలను మోసగించడమేనని గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఆరోపించారు.

  • Loading...

More Telugu News