: వైఎస్సార్సీపీ పని ఇక అయిపోయింది!: ఆనం వివేకా
తాను చేసిన అవినీతిని గడపగడపకూ వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వివరిస్తే బాగుంటుందని టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీలో వైఎస్సార్సీపీ పని అయిపోయిందని, ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో ‘గడపగడపకు వైఎస్సార్ పార్టీ’ అంటూ తిరుగుతున్నారని ఆయన విమర్శించారు. జగన్ కొల్లగొట్టిన రూ.లక్ష కోట్లు ఉంటే ఇప్పుడు మంచి రాజధానిని నిర్మించేందుకు ఉపయోగపడేవని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఒక పార్టీ కార్యాలయాన్ని ఈడీ జప్తు చేయడం చరిత్రలోనే లేదని ఆనం విమర్శించారు.