: దార్ ఏ సలామ్ లో డప్పు వాయించిన నరేంద్ర మోదీ
ప్రస్తుతం టాంజానియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, తనకు సంప్రదాయ స్వాగతం పలుకుతున్న వేళ, ఆ దేశ అధ్యక్షుడు జాన్ మాగుఫులితో కలిసి డప్పు వాయించారు. దార్ ఏ సలామ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన ఆయనకు భారత దౌత్యాధికారులు, ప్రవాస భారతీయులు, చిన్నారులు మువ్వన్నెల జెండాను రెపరెపలాడిస్తూ స్వాగతం పలికారు. మోదీ సైతం ఉత్సాహంగా వారిని పలకరిస్తూ, వారికి షేక్ హ్యాండ్ ఇస్తూ ముందుకు సాగారు. నేటి సాయంత్రం భారతీయులతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. ఆపై టాంజానియా పారిశ్రామికవేత్తలతోనూ సమావేశమై భారత్ లో పెట్టుబడి అవకాశాల గురించి తెలియజేస్తారు.