: మునిగిపోతున్న పడవలోని వారిని కాపాడిన కెప్టెన్ రాధికా మీనన్... బ్రేవరీ అవార్డును పొందిన తొలి మహిళగా చరిత్ర


భారతనారి మరో అరుదైన ఘనతను సాధించింది. ఇంటర్నేషనల్ మేరీటైమ్ ఆర్గనైజేషన్ ప్రకటించే బ్రేవరీ అవార్డును తొలిసారిగా ఓ మహిళ గెలుచుకుంది. 'సంపూర్ణ స్వరాజ్య' ట్యాంకర్ వెసెల్ లో అధికారిణిగా ఉన్న రాధికా మీనన్ కు ఈ అవార్డు లభించిందని నౌకాయాన శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గత సంవత్సరం జూన్ లో బంగాళాఖాతంలో 'సంపూర్ణ స్వరాజ్య' ప్రయాణిస్తున్న వేళ, ఓ చేపల పడవ మునిగిపోతుంటే, దాన్ని చూసిన రాధిక, అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించి పడవలోని ఏడుగురిని రక్షించింది. ఆమె సాహసాన్ని ప్రస్తావిస్తూ, భారత ప్రభుత్వం కెప్టెన్ రాధికా మీనన్ ను ఈ అవార్డుకు ప్రతిపాదించింది. లండన్ లో జరిగిన ఐఎంఓ కౌన్సిల్ 116వ సమావేశంలో రాధికకు అవార్డును ఖాయం చేశారు. జూన్ 22న ఘటన జరిగిందని, 25 అడుగుల ఎత్తయిన అలలు, 60 నాట్ల వేగంతో వీస్తున్న గాలుల మధ్య 2.5 కిలోమీటర్ల దూరంలో మునిగిపోతున్న పడవను చూసిన రాధిక, రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి వారిని కాపాడినట్టు ప్రభుత్వం తెలిపింది.

  • Loading...

More Telugu News