: ఖురాన్ ను నిషేధించే రోజు వస్తుంది... మరణించే ముందు బుర్హాన్ వానీ చేసిన ఆఖరి ట్వీట్ ఇది!
హిజబుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ ముజఫర్ వానీ చేసిన ఆఖరి ట్వీట్ ఏంటో తెలుసా? వివాదాస్పద ఇస్లామిక్ మత బోధకుడు జకీర్ నాయక్ ని ప్రస్తావిస్తూ, రెండు రోజుల క్రితం ఎన్ కౌంటర్ లో మరణించే ముందు బుర్హాన్ ట్వీట్ చేశాడు. జకీర్ నాయక్ కు మద్దతివ్వాలని కోరాడు. "సపోర్ట్ జకీర్ నాయక్. లేకుంటే ఖురాన్ గ్రంథాన్ని నిషేధించే రోజు వస్తుంది" అని ట్వీట్ పెట్టాడు. ఈ పోస్టుకు 26/11 ముంబై ఉగ్రదాడుల హఫీజ్ సయీద్ ను ట్యాగ్ పెట్టడం గమనార్హం. ఇటీవలి ఢాకా రెస్టారెంట్ పై దాడి చేసిన ఉగ్రవాదులు జకీర్ అభిమానులని వెల్లడైన తరువాత, ఆయన వ్యవహారాలపై సందేహాలు తలెత్తిన సంగతి తెలిసిందే.