: ప్రధాని పదవికి పోటీపడి, పూర్తి ఫలితాలు వెలువడకుండానే ఓటమిని ఒప్పుకున్న ఆస్ట్రేలియా విపక్ష నేత
ఆస్ట్రేలియాలో ప్రధాని పదవికి జరిగిన ఎన్నికల్లో మాల్కమ్ టర్న్ బుల్ తో పోటీపడిన ప్రతిపక్ష నేత బిల్ షార్టెన్ ఫలితాలు రాకుండానే తన ఓటమిని అంగీకరించాడు. ఎనిమిదో రోజు ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, తాను ఓడిపోయానని, తిరిగి ప్రధానిగా మాల్కమ్ టర్న్ బుల్ ఎన్నిక కానున్నారని ప్రకటించి సంచలన వ్యాఖ్య చేశారు. కేవలం ఒకటి లేదా రెండు సీట్లతో కన్జర్వేటివ్ పార్టీ కూటమి గెలవనుందని తెలిపారు. కాగా, 150 సీట్లున్న పార్టమెంటులో ఇప్పటివరకూ 140 స్థానాలకు ఓటింగ్ పూర్తయింది. ఇప్పటికే కన్జర్వేటివ్ కూటమి 74 స్థానాల్లో విజయం సాధించింది. విపక్ష లేబర్ పార్టీ 66 చోట్ల గెలిచింది. మరో 10 సీట్లకు ఓట్ల లెక్కింపు జరుగుతుండగా, వాటిల్లో కనీసం రెండు చోట్ల కన్జర్వేటివ్ లు గెలవాల్సి వుంది.