: ఆగ్రా అత్తపై రష్యా కోడలి వినూత్న పోరు


తనను భర్త నుంచి దూరం చేయవద్దని, ఇంట్లోకి రానివ్వాలని, బిడ్డకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, రష్యా యువతి ఓల్గా ఎఫిమెంకోవా ఆగ్రాలో తన అత్త ఇంటి ముందు వినూత్న పోరాటాన్ని ప్రారంభించింది. తన రెండేళ్ల కుమారుడిని ఒళ్లో కూర్చోబెట్టుకుని దీక్షకు దిగి నిరసన తెలుపుతోంది. తనను ఇంట్లో ఉండనీయకుండా అత్త కొట్టి బయటకు గెంటేసిందని, అదే ఇంట్లోకి తనను తిరిగి ఆహ్వానించే వరకూ నిరాహారదీక్ష చేస్తున్నానని వెల్లడించింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే, కుటుంబ వ్యవహారమంటూ, కేసు నమోదు చేసుకునేందుకు నిరాకరించారని తెలియజేసింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది.

  • Loading...

More Telugu News