: కాశ్మీర్ లో గొడవలతో తెలుగువారి తీవ్ర ఇబ్బందులు
తీవ్రవాది బుర్హాన్ వానీ హత్యానంతరం కాశ్మీర్ లోయలో కొనసాగిన అల్లర్లు, ఆపై కర్ఫ్యూ కారణంగా తెలుగు యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పవిత్ర అమర్ నాథ్ యాత్రకు వెళ్లిన 47 మంది తెలుగువారు బల్తాల్ లో చిక్కుకుపోయారు. గత నెల 30వ తేదీన వీరంతా నెల్లూరు నుంచి బయలుదేరి వెళ్లగా, శ్రీనగర్ లో కొనసాగుతున్న కర్ఫ్యూ వీరి యాత్రకు బ్రేకేసింది. ప్రస్తుతం ఓ శిబిరంలో ఉన్న వీరు తమకు సరైన వసతులు కల్పించలేదని, ఆహారం అందడం లేదని, తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఎటూ కదల్లేని పరిస్థితి నెలకొందని, తాము తిరిగి యాత్రను ఎప్పుడు మొదలు పెడతామో కూడా తెలియడం లేదని తెలిపారు.