: తాగుబోతుల వీరంగానికి బలైన రమ్య ఇక లేదు!


తొమ్మిది రోజుల క్రితం మద్యం మత్తు నషాళానికి ఎక్కిన నలుగురు ప్రబుద్ధులు హైదరాబాదు, పంజాగుట్ట ఫ్లై ఓవర్ వద్ద చేసిన యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడిన చిన్నారి రమ్య మృత్యువుతో పోరాటంలో ఓడిపోయింది. తలకు బలమైన గాయాలతో కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమ్య మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. ఇదే ప్రమాదంలో గాయపడి యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె తల్లి రాధికను చివరి చూపు కోసం ప్రత్యేక ఆంబులెన్స్ లో కేర్ ఆసుపత్రికి తీసుకు వచ్చిన క్షణంలో అక్కడ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ప్రతి ఒక్కరి హృదయమూ ద్రవించింది. కన్నీరు మున్నీరైన కుటుంబ సభ్యులు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆనందంగా సాగుతున్న తమ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేశారని రమ్య తండ్రి ఆరోపించారు. రమ్య అంత్యక్రియలను నేడు మధ్యాహ్నం నిర్వహిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News