: కేబుల్ కార్ పై మనసుపడ్డ చంద్రబాబు... ఏపీకి తీసుకురావాలన్న ఆలోచన!
విదేశీ పర్యటనకు బయలుదేరిన చంద్రబాబు బృందం కజకిస్థాన్ రాజధాని నగరం అల్మాటిలో పర్యటించింది. నగరానికి దగ్గర్లోని కోక్ - టోబ్ పర్యాటక ప్రాంతానికి కేబుల్ కారులో వెళ్లిన ఆయన, ఇదే తరహా ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయాలన్న ఆసక్తిని చూపారు. ఓ పర్వతాన్ని మంచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దిన వైనాన్ని ప్రశంసించారు. ఇక్కడి పర్యాటక ఆకర్షణలను స్వయంగా పరిశీలించారు. ఏపీలో కేబుల్ కార్ ప్రాజెక్టుకు అరకు, తిరుపతి వంటి ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయని అభిప్రాయపడ్డ ఆయన, ప్రాజెక్టు వ్యయంపై అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కోక్ - టోబ్ తరహాలో ఏపీలో ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు తెలిపారు.