: కేబీఆర్ పార్కులో రకుల్ ప్రీత్ సింగ్, రాశీ ఖన్నా సందడి


తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం ప్రాజెక్టులో భాగంగా ఈ ఉదయం హైదరాబాదులోని కేబీఆర్ పార్కు వద్ద ఏర్పాటైన ఓ కార్యక్రమంలో హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, రాశీ ఖన్నా లు పాల్గొని సందడి చేశారు. పార్కు వద్ద సందర్శకులకు మొక్కలను పంచారు. ప్రతి ఒక్కరూ ఓ మొక్కను నాటి దాన్ని సంరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించిన వారమవుతామని రకుల్ వ్యాఖ్యానించింది. ప్రభుత్వం చేపట్టిన హరితహారం విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించింది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, పలువురు ప్రభుత్వ అధికారులు సైతం పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News