: మధ్యప్రదేశ్‌ను ముంచెత్తిన వరదలు... 20 మంది మృతి
భారీ వర్షాలు, వరదలతో మధ్యప్రదేశ్ అతలాకుతలమవుతోంది. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. పలు గ్రామాలు నీట మునిగాయి. ఇళ్లు కూలిపోయి పలువురు నిరాశ్రయులయ్యారు. బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదల వల్ల ఇప్పటి వరకు 20 మంది మృతి చెందారు. శనివారం ఒక్కరోజే 8 మంది మృతి చెందారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాజధాని భోపాల్ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. విద్యుత్తు, నీరు, ఆహారం లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. మృతిచెందిన వారిలో ఆరుగురు భోపాల్‌కు చెందిన వారే. వరదల్లో చిక్కుకున్న 5 వేల మందిని సహాయక దళాలు రక్షించాయి. 368 సహాయక కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భోపాల్‌తోపాటు విదిషా, హోషంగాబాద్, బెతుల్ తదితర ప్రాంతాలను కూడా వరదలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.