: దక్షిణాఫ్రికాలో స్టయిల్ మార్చిన నరేంద్ర మోదీ... హాట్ టాపిక్ గా మారిన పూల చొక్కా!
తన దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ధరించిన పూల చొక్కాపై ఇప్పుడు హాట్ హాట్ చర్చ జరుగుతోంది. సాధారణంగా ఫుల్ హ్యాండ్స్ కుర్తా ధరించి కనిపించే మోదీ, తన డ్రస్ స్టయిల్ మార్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. జొహానస్ బర్గ్ లో ప్రవాస భారతీయులతో జరిగిన సమావేశానికి ఆయన ఆఫ్రికన్ స్టయిల్ పూల చొక్కా ధరించారు. ఈ తరహా షర్ట్ లు ఆఫ్రికాలో మంచి ఫేమస్. ఈ కారణంతోనే మోదీ తన డ్రస్ ను మార్చినట్టు తెలుస్తోంది. ఇక మోదీ పూల చొక్కా దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.