: చైనాకు ఝలక్... భారత ఉపగ్రహ సేవలను ఉపయోగించుకోనున్న అమెరికా


ఆఫ్గనిస్థాన్‌లో వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు భారత ఉపగ్రహ సేవలను ఉపయోగించుకోవాలని అమెరికా నిర్ణయించింది. ఆఫ్గాన్‌లో మోహరించిన యూఎస్ దళాలకు ఈ సేవలు ఎంతో ముఖ్యంగా మారనున్నాయి. ఇప్పటికే ఈ సేవలందిస్తున్న యూరోపియన్ ఉపగ్రహం మెటో శాట్-8 ఇరాక్, సిరియాలో ఆపరేషన్స్‌ను కవర్ చేసేందుకు వెళ్లడంతో పెంటగాన్ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా తొలుత చైనా ఉపగ్రహ సేవలను ఉపయోగించుకోవాలని అమెరికా భావించింది. అయితే ఇప్పటికే భారత ఉపగ్రహ సేవలు అమెరికాలోని పలు యూనివర్సీటీల్లో అందుబాటులో ఉండడం, చైనా నుంచి హ్యాకింగ్ భయాలు ఉండడంతో ఆ నిర్ణయాన్ని విరమించుకున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News